అవసరం v/s వ్యక్తిత్వం ….✍


అవసరం మనిషని ఎలాంటి పనికైన దిగజారుస్తుంది….ఒకరు నాతో ఇలా అన్నారు సంఘంలో బ్రతాలంటే మన వ్యక్తిత్వాన్ని, స్వాభిమానాన్ని , అన్ని వొదిలేసి తలదించుకుని,వొంగిపోయి ,లొంగిపోయి భ్రతకాలని లేదంటే నిత్యం సంఘంలో పోరాటం చేస్తుండాలి అని..నేను నా బుర్రని ఆలోచనలో పడేసా అవునా?? అందుకనే నేమో నా జీవితంలో పోరాటమే, పోరాటం జీవితంతా పోరాడుతూనే వున్నా నాకే ఎందుకు ఇంత ఘర్షణ..ఇంత పోరాటం అని అనుకుంటూ వుంన్నా ..అస్సలు నేను ఎందుకు పోరాడుతున్నా దేనికోసం ఇంత ఘర్షణ నాకే ఎందుకు? అందరూ ఎటువంటి పోరాటం లేకుండా భ్రతుకుతున్నారు నేనే ఎందుకు పోరాడుతున్న ..ప్రతి చిన్న..చిన్నా విషయాలకి ,చిన్న..చిన్న సంతోషాలకి వరల్డ్ వార్ చేస్తున్నా ఎందుకు? నేను ఈ సంఘంలో అడ్జెస్ట్ అవలేక పోతున్నాను? అస్సలు ప్రాబ్లం ఎక్కడ వుందా అని ఆలోచిస్తున్నాను…ఎక్కడ కూర్చొని అంటే ఫ్రీగా ఇంత్రేనేట్ వొచ్చే నెట్ కేఫ్ లో మనకు వున్నా పాడుబుద్ధి ఏంటో తెలుసా ఫ్రీగా ఏదైనా దొరుకుతుంది అంటే చాలు పాతాళానికి ఏంటీ పంది దొర్లే బురధలోకైన వెళ్తాము…హూ ఎక్కడడున్నాను నేను నెట్ కేఫ్ లో… నేను ప్రతిసారి అడుగుతా ఇంకా అడుగుతూనే ఉంటా అస్సలు ఈ సఘం అంటే ఎవరూ దానికి పెద్ద ఎవరూ దానిని ఎవరూ నడిపిస్తారు???పనిపాట లేక ఇంట్లో కాలిగా కూర్చుని తినింది అరగక వీధి అరుగుపైన కూర్చుని దారి వెంట వేల్లెవాల్లని ఆపి ఒరేయ్ ఏమిట్రా నీ పెళ్ళాం మీ అమ్మగారు వొస్తే లేచి నిలబదలేదంట కాళ్ళకు దండం కూడా పెట్టలేదంటా ఏమిట్రా దానికి అంతపోగరు నీ పెళ్ళాంన్నీ నీ చెప్పుచేతల్లో పెట్టుకోలేని వాడివి నువ్వేం మగాదివిరా అంటూ వాణ్ని రెచ్చగొడుతూ కాలక్షేపం చేస్తుంటారు…వాడి మొగతనాన్ని శంకిన్చేసరికి వీడికి ఎక్కడో కాలి ఇంటికెళ్ళి వాడి పెళ్ళాన్ని కొట్టి నేను మగాడిని అని నిరూపించుకుంటాడు…పనికి అని బయటకి వెళ్ళిన తన భర్త తిరిగొచ్చి ఎందుకు కొట్టాడో తెలీదు ఆ పిచ్చి తల్లికి… అలా వాళ్ళ చాతకాని తన్నాన్ని ఎక్కడ ప్రశ్నిస్తారో అని మొగుడు పెళ్ళాలకి ,అత్తకోడలికి ,వొదిన మరదలికి గోల్లాలు పెట్టి కూర్చుంటారు…వీళ్ళా… సంఘం అంటేఇలాంటి చాతకాని ధద్ధంమాలా సంఘం అంటే..నాకు ఇలాంటి సంఘం తో పనిలేదు నాకు ఈ సంఘం అక్కరలేదు.. వీళ్ళ కోసం నేను నా స్వభావాలను స్వాభిమానంను వోదులుకోలేను..వాయి వరస బేదం లేని ఈ సంఘం, నీతి జాతి లేని ఈ సంఘం, ధనమనే ఆహంకారంలో మునిగిన ఈ సంఘం, కుళ్ళు కుతంత్రాలతో మయిలబడి ఈ సంఘం , మానవత్వం మరిచిపోయి చీడ పురుగులకన్న హీనమై బ్రస్టు పట్టిపోయిన ఈ సంఘానికి నేను భయపడను నిత్యం ఘర్షణ పడుతూనే ఉంటా పోరాడుతూనే ఉంటా…. మనిషి అవసరం ఎలాంటిది అయినా కావొచ్చు అంత మాత్రానా మన ఉనికిని వోదులుకుంటామా…నేనైతే అస్సలు వోదులుకోను…

మెరుపుకల……… ✍

Gallery

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.