వెన్నెంల్లో…..✍


వేసవి కాలంలో వెన్నెల రాత్రుంల్లో

చల్లగాలులు వీస్తుంటే తలలోమల్లె 

పూల గుప్పు గుప్పున పరిమళాలు 

వీస్తుంన్నాయి మనసున మోహం 

విరబూసి తనువుల స్పర్శకై ఎదురు

చూసే …. మెరుపుకల………✍

అమ్మ నవ్వు వెన్నెలమెరుపు ..✍


వేసవి కాలం సాయంత్రంఏడు అవుతుందివంట పూర్తైయింది అన్నం ఒడ్డిస్తుంన్నా సరే అమ్మా పెట్టు ఒస్తుంన్నా త్వరగా రా తినేసి పడుకుందాముఎందుకు అమ్మ ప్రొద్దుంన్నేలేవాలి పనులు చేసుకోవాలి ..హూ…భోజనం చేసేసాం ..భయట వెన్నెల కాస్తుంది అమ్మ చాపవేసేసా పడుకుందామా హూ… ఒస్తుంన్నాలే నువ్వు వెళ్లి పడుకో… అమ్మ వాకిట్లో కూర్చుంది బుడ్డీ దీపం వెలుగు తగ్గించి బయట వొచ్చి కూర్చుంన్నా ..అమ్మ ఒంటరిగా చీకట్లో ఎందుకు కూర్చునివున్నావు చీకటి ఎక్కడ వుంది వెన్నెల కాస్తుందిగా చల్లగా హాయిగా వుందని కూర్చుంన్నా నేను కాసేపు కూర్చుంటా అమ్మ ఒద్దు పడుకో వెళ్ళి …అమ్మ కాసేపు ప్లీజ్….సరేలే …వాకిట్లో కూర్చొని ఎదురుగా వున్న పొలం,పొలంగట్టు పంటివున్నా కొబ్బరిచెట్లను ,కొబ్బరి ఆకుల మద్యలోంచి కనిపించేచంద్రుంన్నీ చూస్తూ వున్నా చుట్టూ నిషబ్ధం అలా కాసేపు… వేసవి కాలం అర్ధరాత్రి ఆరు బయట వెన్నెల కాస్తుంది చల్లనిగాలులు వీస్తుంన్నాయి…నేను చల్లగాలులతో కొబ్బరి చెట్లతో మాట్లాడుతూ వున్న అమ్మ ఏదో ఆలోచనమునిగి వుంది ..ఒరేయ్ సత్తిగా ఏమి ఆలోచిస్తుంన్నావురా ఏమి లేదు ఏంటీ ఈ జీవితం అని అంత ఎక్కువగా ఆలోచిస్తే ఆరోగ్యం పాడవుతుంది అంతకుమించి ఏంకాదు రా సత్తిగా అన్నాను అమ్మ నా వంక చూసింది నేను భయపడిపోయా అదీ…అమ్మ…అంటూ నీళ్ళు మింగుతుంన్నా అమ్మ నవ్వుతూ వుంది హమ్మంయ్యా నవ్వేసావ నీకు కోపం వచ్చిందేమో అని భయపడిపోయా చట్…భడుగ్గాయి… అంటూ అమ్మ నవ్వుతూనేవుంది …అప్పుడు అమ్మ ముక్కు పుడక టింగుమని మెరిసింది మెరుపు లా ఆ వెన్నెలకాంతీ అమ్మ మొహం మీద పడి ఆ వెలుగులో అమ్మ నవ్వుతూ వుంటే ఎంత అద్బుతంగా హాయిగాసంతోషంగావుంది.. మనసుకి తెలియని ఏదో హాయి నేను ఎన్నటికి మరువలేను ఆనాటిమధుర జ్ఞాపకాన్నీ అమ్మ నవ్వులో వున్న హాయిని అమ్మ మాటల్లో తియ్యదనాంన్నీ అమ్మస్పర్శ చలువదనాంన్నీ ….అమ్మ అంటేనే అమ్మ… అమ్మ తో ఎవరు సరితూగరూ అమ్మగురించి ఎంత చెప్పిన తక్కువే ఇది మా అమ్మ తో గడిపిన మధుర జ్ఞాపకం ….
                                        మెరుపుకల…..✍

ఫీలింగ్…..


ఎగిసే అలల కోరికవు నీవు , కెరటముని వీడిన నురుగుని నేను, గమ్యం లేని ప్రయాణం నాది , తనువు తీరని దాహం నీవు,  నీలిమేఘాల ఘగనం నీవు,  నీరేలేని బంజరుభూమిని నేను , మబ్బులో దాగిన నెలవంక నీవు….
మెరుపుకల …..✍

ఉగాది పండుగ శుభాకాంక్షలు…


 మిత్రులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు…

మహిళాదినోత్సవ శుభాకాంక్షలు


మహిళ దినోత్సవం శుభాకాంక్షలు ..నేను మనస్పూర్తిగా కోరుకునేది ఒకటే ఆడది కూడాఒక మనిషితనకు ఒక మనస్సువుంటుంది, తనకు శరీరంవుంటుంది, తను సంఘంలో ఒక మనిషి,అని గుర్తు పెట్టుకుంటే చాలు.. మీరు ఎలాగో మారరు కానీ ఏదో నా ప్రయత్నం……

మెరుపుకల ………..✍

నీవు… నీవు…✍


మాటల పలుకుల  మంత్రమే నీవు,  మధుర జ్ఞాపకాల రాత్రివి నీవు,  మాయేలే చేసే అందమే నీవు,  నింగిలోని తారల మిలమిల నీవు,  విశ్వమంతా నిండే వెలుగువి నీవు,  మంచులా కరిగే మనసే నీవు,  సెలయేరులోని గలగల నీవు,  ప్రకృతికాంత పరవశం నీవు,  ప్రాణంతీసే పంతమే నీవు,  ప్రణయానికి అంతం నీవు,  నా మధుర జ్ఞపకాల మెరుపుకలవు నీవు…..

మెరుపుకల……..✍

లేము..లేము భరించలేము


నీమౌనం భరించలేను నీ మనస్సు కరిగించలేను

నీ తలపులులేక జీంచలేను నీ జ్ఞాపకాలు లేక 

మరణించలేను కాలం కరిగించేనా నీజ్ఞపకం

హృదయం భరించేన నీ విరహం మాటలకు

అందేన మరపురాని నీ స్నేహం మరచిపోగలన

చితిలోనైనా నీ ప్రణయం మరువలేను ..

మెరుపుకల………✍

సంక్రాంతి శుభాకాంక్షలు…‌✍


మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

మెరుపుకల …….✍

నూతనసంవత్సర  శుభాకాంక్షలు


మిత్రులకు నూతనసంవత్సర  శుభాకాంక్షలు 

దుష్టులకు మీ కర్మ

నీవు …✍


రగిలేమంటల రాతవినీవు 

వీడనితలపుల గాయంనీవు 

రక్తపుదారల రూపంనీవు 

మనసుని చీల్చిన మనిషివినీవు 

మౌనంగానిలిచిన మనసునినేను ….

మెరుపుకల ….✍

Previous Older Entries

Tags

అందం అమ్మ అమ్మ ముక్కు పుడక అవసరాలు ఆడపిల్ల ఇవ్వు ఉగాది శుభాకాంక్షలు ఊపిరి ఎందుకు కలుస్తావు ఎవరోవస్తుంన్నారు ఏం చేసావు ఒంటరిగా కల.. వల.. శిల కవితలు కష్టాలు కారణం క్షణం చనిపోయా చిరిగిన బ్రతుకులు చుక్కల పందిరి చుట్టూ చెట్లు చేరవేమీ జీవించునా జీవితం జ్ఞాపకం జ్ఞాపకాలు తపన తీరమేమీ తెలిపాను నమ్మకం నిన్ను నీ...కై... నీకు ..... లాలిజో.... నీవు నీవే నేరమేమీ పాడుపడినగుడి పిల్లలు పులకరింత పెదవులు ప్రకృతి ప్రాణమా ... చిత్రమా ... రాగమా ప్రేతాత్మ ప్రేమ కథ ప్రేతాత్మ ప్రేమ కథ పార్ట్ {రెండు} ప్రేమ బస్సు బోరునవర్షం భావాలు మనసు మనస్సు మరణం మరిచా మరువలేను ముద్దు మృగాలను మెరుపు కల మెరుపుకల మొగుడు రాతలు . రాత్రి రోడ్డుపైన వర్షం విడాకులు వియోగం వీక్షణం వెన్నెల వెలుగు వేశ్యా సమాజం షూ న్యం సమాజం స్త్రీ స్త్రీ సమాజం స్త్రీ సమాజం (పార్ట్ 1 ) స్వాతి హృదయం

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 13 other followers

%d bloggers like this: