స్వప్నం


ప్రతి నిమిషం గతించే స్వప్నం నీవు, నీవైపే పరుగులెత్తే మనసు నేను,
కథలా నిలిచెను, కన్నీరై కురిసేను, కనుమరుగైపోతాను లే చెలి !!

Gallery


Gallery

హోళిపండుగ శుభాకాంక్షలు..


మిత్రులందరికి హోళి పండుగశుభాకాంక్షలు

Gallery

అవసరం v/s వ్యక్తిత్వం ….✍


అవసరం మనిషని ఎలాంటి పనికైన దిగజారుస్తుంది….ఒకరు నాతో ఇలా అన్నారు సంఘంలో బ్రతాలంటే మన వ్యక్తిత్వాన్ని, స్వాభిమానాన్ని , అన్ని వొదిలేసి తలదించుకుని,వొంగిపోయి ,లొంగిపోయి భ్రతకాలని లేదంటే నిత్యం సంఘంలో పోరాటం చేస్తుండాలి అని..నేను నా బుర్రని ఆలోచనలో పడేసా అవునా?? అందుకనే నేమో నా జీవితంలో పోరాటమే, పోరాటం జీవితంతా పోరాడుతూనే వున్నా నాకే ఎందుకు ఇంత ఘర్షణ..ఇంత పోరాటం అని అనుకుంటూ వుంన్నా ..అస్సలు నేను ఎందుకు పోరాడుతున్నా దేనికోసం ఇంత ఘర్షణ నాకే ఎందుకు? అందరూ ఎటువంటి పోరాటం లేకుండా భ్రతుకుతున్నారు నేనే ఎందుకు పోరాడుతున్న ..ప్రతి చిన్న..చిన్నా విషయాలకి ,చిన్న..చిన్న సంతోషాలకి వరల్డ్ వార్ చేస్తున్నా ఎందుకు? నేను ఈ సంఘంలో అడ్జెస్ట్ అవలేక పోతున్నాను? అస్సలు ప్రాబ్లం ఎక్కడ వుందా అని ఆలోచిస్తున్నాను…ఎక్కడ కూర్చొని అంటే ఫ్రీగా ఇంత్రేనేట్ వొచ్చే నెట్ కేఫ్ లో మనకు వున్నా పాడుబుద్ధి ఏంటో తెలుసా ఫ్రీగా ఏదైనా దొరుకుతుంది అంటే చాలు పాతాళానికి ఏంటీ పంది దొర్లే బురధలోకైన వెళ్తాము…హూ ఎక్కడడున్నాను నేను నెట్ కేఫ్ లో… నేను ప్రతిసారి అడుగుతా ఇంకా అడుగుతూనే ఉంటా అస్సలు ఈ సఘం అంటే ఎవరూ దానికి పెద్ద ఎవరూ దానిని ఎవరూ నడిపిస్తారు???పనిపాట లేక ఇంట్లో కాలిగా కూర్చుని తినింది అరగక వీధి అరుగుపైన కూర్చుని దారి వెంట వేల్లెవాల్లని ఆపి ఒరేయ్ ఏమిట్రా నీ పెళ్ళాం మీ అమ్మగారు వొస్తే లేచి నిలబదలేదంట కాళ్ళకు దండం కూడా పెట్టలేదంటా ఏమిట్రా దానికి అంతపోగరు నీ పెళ్ళాంన్నీ నీ చెప్పుచేతల్లో పెట్టుకోలేని వాడివి నువ్వేం మగాదివిరా అంటూ వాణ్ని రెచ్చగొడుతూ కాలక్షేపం చేస్తుంటారు…వాడి మొగతనాన్ని శంకిన్చేసరికి వీడికి ఎక్కడో కాలి ఇంటికెళ్ళి వాడి పెళ్ళాన్ని కొట్టి నేను మగాడిని అని నిరూపించుకుంటాడు…పనికి అని బయటకి వెళ్ళిన తన భర్త తిరిగొచ్చి ఎందుకు కొట్టాడో తెలీదు ఆ పిచ్చి తల్లికి… అలా వాళ్ళ చాతకాని తన్నాన్ని ఎక్కడ ప్రశ్నిస్తారో అని మొగుడు పెళ్ళాలకి ,అత్తకోడలికి ,వొదిన మరదలికి గోల్లాలు పెట్టి కూర్చుంటారు…వీళ్ళా… సంఘం అంటేఇలాంటి చాతకాని ధద్ధంమాలా సంఘం అంటే..నాకు ఇలాంటి సంఘం తో పనిలేదు నాకు ఈ సంఘం అక్కరలేదు.. వీళ్ళ కోసం నేను నా స్వభావాలను స్వాభిమానంను వోదులుకోలేను..వాయి వరస బేదం లేని ఈ సంఘం, నీతి జాతి లేని ఈ సంఘం, ధనమనే ఆహంకారంలో మునిగిన ఈ సంఘం, కుళ్ళు కుతంత్రాలతో మయిలబడి ఈ సంఘం , మానవత్వం మరిచిపోయి చీడ పురుగులకన్న హీనమై బ్రస్టు పట్టిపోయిన ఈ సంఘానికి నేను భయపడను నిత్యం ఘర్షణ పడుతూనే ఉంటా పోరాడుతూనే ఉంటా…. మనిషి అవసరం ఎలాంటిది అయినా కావొచ్చు అంత మాత్రానా మన ఉనికిని వోదులుకుంటామా…నేనైతే అస్సలు వోదులుకోను…

మెరుపుకల……… ✍

Gallery

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు….✍


మనదేశంలో కాదు కాదుప్రపంచంలో ఆడవాళ్ళను మగాడు అనిచేస్తుంన్నాడు ..తొక్కేస్తుంన్నాడు ..అని అంటారు కానీ నాకు తెలిసినంత వరకు నేను పురాణాలలోచదివా సినిమాల్లో చూస ఎక్కడైనా దేంట్లో నైన ఆడవాళ్ళపైన ఆడవళ్ళే అసూయపడి తక్కువ చేసి నీచంచేసి ఆడదానికి ఆడదే శత్రువుల వుంటారు.. ఇలా ఒకరికి ఒకరు తక్కువ చేసుకునినీచం చేసుకునే క్రమంలో మగాడిని గొప్ప చేసి కిరీటం పెట్టిసింహాసనం ఎక్కించారు ..ఎలా అంటే రెండు పిల్లులు గొడవ పడితే మధ్యలో కోతి లాభ పడిందన్నట్టు ..ఇద్దరి ఆడవాళ్ళ అసూయ జలసీ ఈర్షా ల వల్ల మద్యలో మగవాడు లాభపడ్డాడు ..మగవాడిని అని ఏమీ లాభం లేదు..పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరిగి పెట్టిందంటా.. అలా మగాడినిగొప్ప చేసి వాడు మగాడుఎన్ని పెళ్ళళ్ళు అయినా చేసుకోవచ్చు ఎంత మంది ఆడవాళ్ళతో నైనా ఆక్రమ సంబంధం పెట్టుకోవచ్చు అర్థరాత్రివరకు రోడ్లమీద బలదూర్ తిరగొచ్చు చెడ్డీల మీద వీధులంబడి తిరగొచ్చు ..వయస్సులోచిన్నవాడైనా వాడుచెప్పినట్టే వినాలి వాడు కొడితే భరించాలి ఇవంన్నీ మనకు నేర్పించింది ఎవరు? నేను అంటుంన్నానని మీ అందరికీ కోపం వస్తుంది కానీ ఒక్కసారి మీ బుర్రనీ చల్లబరచి సహనంగా ప్రశాంతంగాఒక్కసారి ఆలోచించండి నేనన్నది అక్షరసత్యం.. మన చిన్నప్పటి నుంచి మన అమ్మ అమ్మ మ్మా నానమ్మ లు ఏంచెప్పారు మగాడుచాలా గొప్ప మొగుడు కొడితే భరించాలి ఏంచేసిన సహించాలి వాడికి గొడ్డుచాకిరి చేయాలి అని చెప్పి చెప్పిచెప్పి మన మెదడులో ఒక వైరస్ లాగ ఎక్కించారు వైరస్ నీ అన్న ఆంటీ వైరస్ తో తీసేయొచ్చు కానీ వీళ్ళు ఎక్కించిన మగాడు గొప్ప ఆడది తక్కువ అనే ఈ వైరస్ కీ మందులేదు.. అది మనలోపల నుండి రావాలి మార్పు మన ఆలోచనలో మార్పు రావాలి మనప్రవర్తన లో మార్పు రావాలి అప్పుడే ఆడవాళ్ళకి స్వాగతంత్రం వొచ్చినట్టు …ఓ మహా గొప్ప మాతృమూర్తుల్లారా అమ్మమ్మ ల్లరా నానంమ్మా ల్లరా మీ అందరికీ చేతులెత్తీ నమస్కరిస్తుంన్నాను దయచేసి మీరు ఆడపిల్ల లనీ గొప్పగా మార్చమని అడగడం లేదు కనీసం ఒక్క మాట చెప్పండి చాలు మీరు భరించకండి ఎదురుతిరగండీ మీ జీవితం మీరే పోరాడండి మీశ శక్తి కి ఎదురులేదు …భరించడం మానీ ఎదురించడం నేర్చుకో ..ఈ సమాజమనే కౄర అడవిలో మానవమృగాలతో నిత్యం పోరాడు.. కౄరమానవ మృగాలను వెంటాడు వేటాడు చీల్చీ చెండాడు… మహిషాసుర మర్థినివై ఈ మానవ మృగాలను వధించు ఆడపిల్లలను కాపడండీ వాళ్ళకి ఎదురించడం నేర్పించండి నవమాసాలు మోసికంన్నారు కదా ఈ ప్రపంచంలో కన్న తల్లి కన్నా గొప్ప టీచర్ వేరెవరు వుండరు ……….

…………..మెరుపుకల…..✍

Gallery

మాతృమూర్తీ నీకు వందనాలు తల్లి…✍


అమ్మ ప్రేమను అమ్మ గురించి ఎంతచెప్పిన ఎంత రాసినచాలా తక్కువే .అమ్మ ప్రేమను ఏ భాషలో రాసిన ఎన్నీ పదాలు కూర్చునా ఆ అనుభవాన్నీ పొందలేము. అమ్మచేతి స్పర్శ ,అమ్మ చేతి పప్పు అన్నం ముద్దులు‌‌‌,అమ్మ నవ్వులోని వెన్నెల చలువదం , అమ్మ ఒడిలో హాయి నిద్ర, ఇలా అమ్మ గురించి చెప్పడం మొదలు పెడితే అంతం మే లేదు అమ్మగురించి ఎంత రాసిన తక్కువే.. అమ్మ గురించి ఏదో రాయాలి అనుకొని బాగాఊహించి రాసి ఎవరో మెప్పు పొందడం కాదు కనీసం ఈరోజుఅయిన నిజాయితీగా మన నిజ జీవిత అనుభవం రాస్తుంన్నా…ఎవరికోసమో రాయడంలేదు మా అమ్మ తో నా అనుభవాలు నెమరేసుకుంటుంన్నా ….

హ్యపీ మదర్స్ డే (happy mother day)…..

మెరుపుకల ………..✍

Gallery

జాగ్రత్తా …✍ 


జాగ్రత్త అంటే నాకు భలే నవ్వోస్తది ఎందుకంటే ఒక్క జాగ్రత్త అన్న పదంలో బోలెడుఅర్థం ఉంటుంది… నువ్వు నాకు మాత్రమే సొంతం.. నువ్వునాకు మాత్రమే అందాలి నేను మాత్రమేనిన్ను అనుభవించాలి ఇంకెవ్వరికి నువ్వుదక్కకూడదు అన్న స్వార్థం..స్వార్థం ప్రతి ఒక్కరికీ ఉంటుంది..అతి ఎక్కువస్వార్థానికి వేరే గొప్ప పదాలు దొరకడం లేవండి నాకు… నేనునిన్ను బాధపెట్టొచ్చు కానీవేరెవరు పెట్టొద్దు జాగ్రత్త… నేను నిన్ను గాయపరుస్తా కానీజాగ్రత్త.. నేను నిన్ను ద్వేశిస్తా కానీజాగ్రత్త…నేను నీ హృదయాన్నీ చీల్చేస్తా కానీ జాగ్రత్త…నాకు

నాకు నేనే స్నేహాన్నీ ….✍


నేను ఈ బ్లాగు మొదలు పెట్టింది నా ఒంటరి తనం పోవడానికి నాతో నేనుమాట్లాడుతూ వుంటా పిచ్చిఎక్కిందేమో అనిపిస్తుంది నాకే ఒకోసారి ..నాకు నేనే అనుకుంటా నన్ను ఎవరూఅననక్కర లేదు …ఈ బ్లాగు నాతోడు నాస్నేహం.. నాకోపం.. నామౌనం ..నా బాధ..అన్ని బ్లాగే ఎందుకంటే నేను ఏది చెప్పిన వింటుంది కోపంతో తిట్టిన ఏమనదు ఎదురు సమాధానంఇవ్వదు కబట్టీ .. నా మీద అలగదు మాట్లడంమ్ మానదు అందుకని …మనము రోజూ ఫోన్ లో మాట్లాడుతూ వుంటాం తిన్నావా ఏం బట్టలు వేసుకోవాలి ఏంబట్టలు వేసుకున్నావు అంటూ రోజూఏవో పనికిమాలిన కబుర్లు చెప్పి కాలక్షేపం చేసి మనకు ఎప్పుడైతే బాధగా వుండి మనస్సు బాలేనప్పుడు ఓదార్ప మాటలుచెప్పాల్సీన సమయంలో వాళ్ళు వాల పనుల్లో బిజీగావుంటారు.. మనిషికి ఏమీ వసరం పనికిరాని మాటలు కాదు నిరాశలో వున్నప్పుడు కాస్త ఓదార్పు మాటలుచెప్పి మనస్సుకు ప్రశాంతత కలిగించాలి బాధలో వుంన్నప్పుడు పక్కనే వుండి బుజంతట్టాలి… అలాంటి వాళ్ళు లేరండి …ఉంటే బాగుండేమో అనిపిస్తుంది… ఈ అవసరాల స్నేహాలు ..స్వార్థపు స్నేహాలు..కుళ్ళు స్నేహాలు వీటికన్నా ఒంటరి జీవితం ఎంతో సుఖః.. ప్రశాంతత…ఇవాళ వెన్నెంల్లో పుల్లట్లు తిన్న అది కూడా వేసవికాలం సాయంత్రం వేళ చల్లనిగాలి మల్లెపూల పరిమళాలు వీస్తూంటే వేడి వేడిపుల్లట్లు అందులోకి వెళ్ళుళ్ళి కారం.. హూహూహూ…..తింటూ వుంటే నాసామిరంగా భలేగ వుందంటే నమ్మండి. అంత బాగా వుంటుందని నాకు తెలీదు మొదటి సారి ఆ అనుభవం చాలా బాగుంది…

Gallery

ఉగాది పండుగ శుభాకాంక్షలు


తెలుగు వారందరికీ నూతనసంవత్సర శుభాకాంక్షలు బ్లాగర్లందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు

Gallery

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు


ఎన్ని సార్లు ఆలోచించినా ఈ మహిళల దినం ఏంటో అంతుపట్టలా..మహిళలను అస్సలు గౌరవించనీ ఈ సభ్య సమాజం.. కన్న కూతురికి కూడా రక్షణ లేని ఇల్లు..కట్టు కున్నా భార్యను కట్టు బానిసలుగా చేసిన మొగుళ్ళూ…సమానత్వం సమానత్వంఅంటూ ఉద్యోగాలు వెలగబెడుతుంన్నామంటూ కన్నపిల్లల జీవితాలు సంకనాకిస్తున్న గొప్పమాతృమూర్తులు… ఈ గొప్ప సభ్యసమాజం మనుషుల్ని వొదిలేసి వస్తువులని ప్రేమిస్తున్నాడు ఈ మానవ జాతిబహు గర్వీంచదగింది… స్వేచ్ఛ కావాలి అంటూ భర్తలకు విడాకులు ఇస్తున్నారు మన ఆడలేడీసు ..ఏంత చేస్తున్నప్పటికి ఎన్ని మార్పులు వచ్చిన ఈ రోజుకీ స్త్రీ కీ రక్షణ లేదు…ఆడ పుట్టుకకే రక్షణ లేదు గౌరవం లేదు విలువ లేదు…..

మెరుపుకల……..✍

Gallery

Previous Older Entries