నేనేందుకు భరించాలి …


ఆడదానిగా పుడితే అన్ని భరంచాలా ?? ఎందుకు భరించాలి నిన్ను ప్రేమ స్తే నువ్వు పెట్టే బాధలు భరించాలా నువ్వు చేసే తప్పుడు పనులన్నీ సమర్థించాలా నేను నీకు బానిసా నన్ను ఎంత పెట్టి కొనుక్కున్నావు డబ్బులు ఇచ్చి పనివాల్లని పెట్టుకుంటే వాళ్ళు కూడా ఓ మాట అంటే పడరు అంత కన్నా నీచమా ఆడవాళ్ళు అంటే.. మేము కంటే తప్ప మీకు పుట్టుక లేదు మీరు మమ్మల్ని శాసించే అధికారమా . మీకు ఏ హక్కు లేదు . పుట్టినప్పటినుండి మొదలు భరించడం అన్న కొట్టిన భరంచాలి తమ్ముడు తిట్టినా భరించాలి అటువెళ్ళకు ఇటువెళ్ళ కు పక్కింటి వాడు బుగ్గ గిల్లుతాడు పోనీలే నువ్వు చిన్నపిల్లవు కదా నువ్వు బాగుంటావు కదా అందుకే గిల్లాడు ఊరుకో .. అమ్మా రోడ్డుపైనా కుర్రాళ్ళు పిచ్చిగా మాట్లాడుతున్నారు వాళ్ళను పట్టించుకోకుండా వెళ్ళి పో ఏంచేస్తాం ఆడవాళ్ళం భరించుకోవాలి అన్ని .. బస్సు లో ఒకడు తగులుతాడు ఇంకోడు రుద్ధుతుంటాడు ఇంకోడు ఎక్కడ పడితే అక్కడ చేతులూ వేస్తాడు అయినా భరించాలి ఎవరికోసం ఎందుకోసం భరించడం . చిన్నప్పుడు నుండి అమ్మ భరించడం మాత్రమే నూరిపోస్తుంది ఎందుకో తెలీదు భరించడం బదులుగా తప్పు చేసినా వాడి చెంప పగలగొట్టు , నీ మీద ఎవరైనా సరే తండ్రి కానీ తోడబుట్టిన వాడైనా బయట వాళ్ళై నా నువ్వు భరించవద్దు ఎదురుతిరుగు నిన్ను నువ్వు కాపాడుకో నీ ఆత్మ రక్షణకై నువ్వు పోరాడాలి అని ప్రతి తల్లి తన బిడ్డ కు నేర్పాలి అది మానేసి ఈ భరించడం అనేది నేర్పుతున్నారు . ప్రకృతిలో పుట్టిన ప్రతి జీవి లక్షణం తన ఆత్మ రక్షణకై పోరాడడం దాన్ని ఈ మాతృ మూర్తులు మార్చి భరించడం అనే కాంసెప్ట నేర్పి బ్రతుకు తున్నారు దీన్ని నేను ససేరా ఒప్పుకోను ….. మార్పు అనేది ఎక్కడో కాదు ఆడవాళ్ళలో రావాలి మార్పు , ప్రతి తల్లి లో రావాలి మార్పు .. ఎవరు ఎన్ని కారణాలు చెప్పిన ఏ చట్టాలు మారినా , మార్పు ఆడవాళ్ళలో నే రావాలి .. తల్లి పిల్లల్ని చూస్తూ సంసారం చక్కదిద్దు కోవాలి తండ్రి భయట సంపాదించి భార్య బిడ్డలను పోషించుకోవాలి …

బంధాలు ….


బంధాలు అనేవి ఎవరు పెట్టారు అస్సలు బంధం అంటే ఏమిటి ? ఒక మనిషిని ఇంకో మనిషి శారీరపరంగా మనస్సు పరంగా ఒకరికొకరు పీక్కుతినడమేనా బంధం అంటే , వాళ్ళ ఆలోచనలకి , వళ్ళ భావాలకి విరుద్ధంగా ప్రవర్తించడమేనా బంధం అంటే ? ప్రపంచంలో ఏ బంధం అయినా ఎంత సంతోషంగా మొదలు పెడతామో అంతే సంతోషంగా విడపోవాలి . ఏ బంధంలో అయినా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి ఎప్పుడు బానిస కాదు . విడిపోయే ముందు ఎందుకు మరీ దౌర్జన్యం వాళ్ళ పైనా , కోపాలెందుకు , అసహ్యం ఎందుకు . ఏ బంధమైన మొదలైనప్పుడు ఎంతో ఇష్టంతో , ప్రేమతో , మొదలవుతుంది . చిన్న మనస్పర్దలు , అండస్టాడింగ్ లేనప్పుడు వెంటనే వాళ్ళపై పగలు , కోపాలు , అసహ్యం అన్నీ వస్తాయి ఎందుకు అప్పుడు వరకు నువ్వంటే ప్రాణం అంటారు చిన్న గొడవకే అంత శత్రువు అయిపోతారా అదేనా బంధం అంటే .

ఇంకేమి వుండదా . కనీసం డబ్బులుకు , వస్తువు లపై వున్న ఇష్టం మనిషిపైనా వుండవు ఎందుకు ఒకప్పుడు వస్తువులను వాడుకునేవాళ్ళు మనిషిని ప్రేమించేవాళ్ళు కానీ ఇప్పుడు పూర్తిగా రివర్స నడుస్తుంది . కనీసం మానవత్వం కూడా లేదు మనమద్య . ప్రపంచం అంతా డబ్బుల మయం . ఒక అమ్మాయి , అబ్బాయి కి మద్య స్నేహం ఎంత ఇష్టంగా హాయిగా వుంటుంది వాళ్ళ కి ఆ స్నేహం కంట్యున్యూ చేయడం ఇష్టం లేకపోతే వాళ్ళ మద్య స్నేహం అంతే ఆనందంగా బ్రేక్ అవుతుంది . ఆవిషయంలో ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు అదే భార్య భర్త ల బంధం మాత్రం నలుగురు లోకి ఈడ్చి రచ్చ , రచ్చ చేసి ఆ విడిపోవడం విషయం ఒప్పుకోరు . ఫ్రెండ్స్ విడిపోతే ఏమనరు , లవర్స్ విడిపోతే ఏమనరు కానీ మొగుడు , పెళ్ళాం అనేసరికి ఎందుకు ఒప్పుకోరు . ఎందుకు అంత కాంపిక్లేట్ చేస్తారు కలిసి వుండాలని అనుకున్నా విడి పోవలనుకున్నా వాళ్ళ జీవితం కదా మీరెవరు మీరెలా నిర్ణయిస్తారు కలిసి వుండాలని .

ఒక మూర పసుపు తాడు కట్టినంత మాత్రాన ఆమే అతనికి , అతను ఆమెకి బానిస అయిపోతారా . అంకన్నా పెద్ద తాడు జంతువుల కు కడతాం వాటికి మనకు తేడ ఏంటి . ప్రకృతిలో పుట్టిన ప్రతి ప్రాణికి స్వాతంత్రం వుంది ఇంకో జీవికి గానీ ఇంకో వ్యక్తి కి కానీ బానిస కాదు మనం ఎందుకు ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం ఎందుకు నీచం అయిపోయాం ? హాయిగా సంతోషంగా జీవితాన్ని గడపాలి .