యాదా ….. (పార్ట్ 3 )


అది ఎండాకాలం ఆ నీళ్ళలో కాళ్ళు పెడితే ఎంత హాయిగా ఉంది అంటే నేను మాటలలో చెప్పలేను . ఆ నీళ్ళలో నా కాళ్ళు పెట్టగానే చిన్న చిన్న చేపలన్నీ జల్లు మని అన్ని ఒకేసారి నా కాళ్ళ చుట్టూ వచ్చి వాటి నోరు తెరిచి నా కాళ్ళను నాకుతున్నాయి . తినేవస్తువేదో వొచ్చింది అనుకున్నట్టున్నాయి కాబోలు నా కాలు అని వాటికి తెలీదు కదా . అవి చిన్న నోటితో ఆమ్ …… ఆమ్ ….. ఆమ్ …… అని మృదువుగా , మెత్తగా నా కాలుకి తినడానికి ప్రయత్నం చేస్తున్నాయి నాకేమో గిలిగింతలు పెడుతున్నాయి నేను వెంటనే నా కాళ్ళను నీళ్ళలో నుండి తీసేసా …

నా చేతిలో బిస్కేటు వుంది అది తుంచి ఆ నీళ్ళలో వేసా ఆ చేపలు అన్ని జుంమనీ ఒకే చోటకి వొచ్చి ఆ బిస్కేట్ నీ ఒక్క సెకనులో తినేసాయి . పాపం వాటికి ఎంత ఆకలి వేస్తుందో ఏమో . నా దగ్గర ఉన్న బ్రెడ్డు కూడా వేసేసా దాంతో వాటి ఆకలి తీరింది అనుకోను కానీ నన్ను చూసి సంతోషించాయి అని చెప్పగలను. వాటితో చాలా సేపు ఆడుకున్నా . చేయి పెట్టగానే జుంమని వస్తాయి కాస్త నా వేళ్ళను కదలిస్తే చాలు చటుక్కుమని పారిపోయేవి అల ఆడుకున్నాము. నేను చేయి పెట్టకపోతే అవి అన్ని ఒకచోట చేరి తలలు నీళ్ళలో నుండి పైకి పెట్టి నన్ను చూసేవి.

అలా తిండి తిప్పలు ఏవీ లేక నీరసం ఉంది రెండవ రోజు కూడ గడిచిపోయింది . మెల్లిగా కళ్ళు తెరిచి చూసాను చెట్లు కొమ్మకు తట్టుకుని వున్న నీళ్ళ ఫోర్స్ ఎక్కువగా వుంది ఒంటినిండ చేతికి గాయాలు ఉండడంతో ఆ కొమ్మని పట్టుకోలేక పోతున్న . నా పక్కనుండి ఓ పిల్లి పిల్ల కొట్టుకుని పోతుంటే దాన్ని కాపడుదమని చేయి చాచి దాన్ని అందుకునే ప్రయత్నం చేస్తున్న …. ఆ….. అమ్మ ….. ఆ…. అమ్మయ్యా దొరికింది పిల్లికూన ఒక చేతితో పట్టుకుని దగ్గరగా తీసుకున్న .

నేనే బ్రతుకు తానో లేదో తెలీదు తిండి తిప్పలు లేవు ఆ నీళ్ళలో ఎటుకొట్టుకు పోతున్నానో నాకే తెలీదు కానీ ఆ పిల్లిని కాపాడి నందుకు ఎక్కడలేని సంతోషం కలిగింది . కానీ నా చేతికి ఉన్న గాయల కారణంగా కొమ్మని వొదిలేసా ఆ వరదనీటిలో కొట్టుకు పోతున్నాము . (మూడవరోజు) ఆ తుఫాను దాటికి ఒక పెద్ద చెట్టు విరిగి అడ్డంగా పడి వుంది. దాన్ని చూసి ఆ చెట్టు దగ్గరగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్న . ఏ పాప అంటే పిల్లి ని పట్టుకుని వండు లేదా మనం మునిగి పోతాం మియాం…….. మియాం…… నీ భాష నాకు అర్ధం కాదు కానీ అలాగే నాబుజం పై వుండు . ఏ…….. ఏ……. పట్టుకో అన్నాన ఆంయ్ .